
ఆనందోత్సాహాలతో పండుగ నిర్వహించుకోవాలి
నాగర్‌కర్నూల్: జిల్లా ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ కోటికాంతులు నింపాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటి నుంచి వెలుగు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. పండగ సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
●