
మిగిలింది.. 48 గంటలే
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ4 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో టెండర్లు దాఖలు కాకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 542 టెండర్లు దాఖలు కాగా.. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 144 వచ్చాయి. ఇక వనపర్తి జిల్లాలో మద్యం వ్యాపారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు 34 దుకాణాలకు కేవలం 120 టెండర్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 1,211 దరఖాస్తులు రాగా.. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.34.53 కోట్ల ఆదాయం సమకూరింది. మిగిలిన రెండు రోజుల్లో ఏ స్థాయిలో టెండర్లు వస్తాయనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. గత రెండేళ్ల కిందట స్వీకరించిన దరఖాస్తుల్లో చివరి మూడు రోజుల్లో భారీగా పెరిగినా.. ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..
జిల్లా గురువారం మొత్తం ఆదాయం
వచ్చినవి టెండర్లు (రూ.కోట్లలో..)
మహబూబ్‌నగర్ 144 396 11.88
నాగర్‌కర్నూల్ 125 256 7.68
జోగుళాంబ గద్వాల 103 233 6.99
నారాయణపేట 110 206 6.18
వనపర్తి 60 120 1.80
మద్యం దుకాణాల టెండర్ల దాఖలుకు రేపటితో ముగియనున్న గడువు
ఉమ్మడి జిల్లాలోని 227 షాపులకు 1,211 దరఖాస్తులు
ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.34.53 కోట్ల ఆదాయం