
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
లింగాల: విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చాలని, మరుగుదొడ్లు సరిపోను లేవని విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందిస్తూ పాఠశాలలో అన్ని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గిరిజన విద్యార్థినుల చదువుకోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మండల కేంద్రంలో నిర్మించే నూతన పాఠశాల భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతన భవనాన్ని నిర్మించుటకు అవసరమైన స్థలాన్ని నిర్దారించారు. కార్యక్రమంలో ఎంఈఓ బషీర్ అహ్మద్, విద్యాశాఖ ఏఈ కోటేశ్వర్‌రావు, మార్కెట్ డైరెక్టర్ ముక్తార్, నాయకులు పాల్గొన్నారు.