
చేపపిల్లల పంపిణీపై నీలినీడలు..
జిల్లాలో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. చాలావరకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఇప్పటికే చేప పిల్లల పంపిణీ చేపట్టాల్సి ఉండగా.. టెండర్ల ప్రక్రియ పూర్తికాకపోవడంతో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ఈసారి జిల్లాలో సుమారు 2.60 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గతంలో నిర్వహించిన చేపపిల్లల పంపిణీ రికార్డులు లేకపోవడం, జమాఖర్చుల వివరాలు లేకపోవడంతో అయోమయం నెలకొంది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించాలని మత్స్యకారులు కోరుతున్నారు.