
రాజీ మార్గంతో సమయం ఆదా
నాగర్‌కర్నూల్: రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని.. ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీసు ఉన్నతాధికారులు, ఎకై ్సజ్‌శాఖ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. 13న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు సాధ్యమైనన్ని ఎక్కువ కేసులను రాజీ చేసుకునేలా పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని.. లోక్‌అదాలత్ ద్వారా కేసులు రాజీ చేసుకునే ఇరు వర్గాలకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. తద్వారా డబ్బు, సమయం ఆదా అవుతాయని.. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుందని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి శృతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి, సీఐ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.