మాకు శనివారం సాయంత్రం క్యాబేజీ పకోడి, ఆలుగడ్డ కూర, అన్నం, సాంబారు, పెరుగు పెట్టారు. పెరుగు తినేటప్పుడు ఇబ్బంది పడ్డాం. మేము తిన్న తర్వాత రాత్రి 11.30 గంటలకు కడుపులో నొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో 12 గంటలకు మా మేడం వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
– అక్షయ, ఇంటర్ మొదటి సంవత్సరం
అన్నం ఉడకలే..
పాఠశాలలో మాకు అందించే భోజనం సరిగా ఉండదు. అన్నం, కూరలు సరిగ్గా ఉడకవు. అన్నం బియ్యం మాదిరిగా ఉంటుంది. శనివారం సాయంత్రం క్యాబేజీ పకోడి తిన్నాం. అది కూడా సరిగా ఉడకలేదు. పెరుగు పుల్లగా ఉండటంతో దాని తినడం వలన వాంతులు, కడుపులో నొప్పి వచ్చింది.
– మానస, 6వ తరగతి
ఎవరిది బాధ్యత..
పిల్లలకు వాంతులు, విరేచనాలు అయితే మా కు ఉదయం వరకు సమాచారం ఇవ్వలేదు. మే ము సామాజిక మా ధ్యమాల ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాం. మా పిల్లలకు ఏమ న్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇక్క డి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
– మధు, బుద్దారం, వనపర్తి జిల్లా
చర్యలు తీసుకోవాలి..
గురుకుల పాఠశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. ఇంతకు మునుపు కూడా ఈ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇది ముమ్మాటికి ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, అచ్చంపేట
●
పెరుగు బాలేదు..
పెరుగు బాలేదు..
పెరుగు బాలేదు..