
గతంలో జరిగిన సంఘటనలు గుర్తులేవా?
నాగర్‌కర్నూల్ క్రైం: ‘శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాల్లో ఎన్ని సంఘటనలు జరిగాయో ఆత్మవిమర్శ చేసుకోవడంతోపాటు విద్యార్థులను కేసీఆర్ ఎన్నిసార్లు పరామర్శించారో హరీశ్‌రావు సమాధానం చెప్పాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గురుకులాల్లో వేలాది మంది అస్వస్థతతకు గురయ్యారని, 160 మంది మృతిచెందారని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలోనే గురుకులాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని మాట్లాడటం హరీశ్‌రావు స్థాయికి తగదన్నారు. అంతకు ముందు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.