ములుగు రూరల్: మహిళలు స్వయం ఉపాది పొందుతూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద పొట్లాపూర్‌కు చెందిన సీత స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డూ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రుణాలు అందిస్తూ సహకరిస్తుందని తెలిపారు. మహిళలు సాంప్రదాయ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తూ ఆధునిక మార్కెట్‌కు తరలిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు. అనంతరం సంఘం సభ్యులతో ఇప్పపువ్వు లడ్డూ తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
మోటార్లతో పంపింగ్ కొనసాగించాలి
కన్నాయిగూడెం: దేవాదుల వద్ద సాంకేతిక లోపంతో ఉన్న మోటార్‌ను వెంటనే సరిచేసి పది మోటార్లతో నీటి పంపింగ్ కొనసాగించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్‌సహదేవరావు అన్నారు. ఈ మేరకు అధికారులతో కలిసి తుపాకులగూడెంలోని దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ఆయన సందర్శించారు. దేవాదులలో ఉన్న పది మోటార్లలో తొమ్మిది మోటార్లు నీటిని పంపింగ్ చేస్తుండగా ఫేజ్‌త్రీలోని ఒక మోటార్ సాకేతిక లోపంతో పంపింగ్ చేయడానికి వీలులేకుండా ఉందని తెలిపారు. వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం మోటార్ల పంపింగ్, వాటి పని తీరును తెలుసుకుని సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎస్పీ సుధీర్
రాంనాథ్ కేకన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ రామ్మోహన్, డీఈఈ శరత్ బాబు ఉన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


