ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి

ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గోవిందారావుపేట, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలాల వ్యవసాయశాఖ అధికారులకు, కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రానికి ఆయన హాజరై మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లు ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ధాన్యంలో తేమశాతం 17 వచ్చిన తర్వాత మాత్రమే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు. హార్వెస్టర్‌ యజమానులు ధాన్యం కోత సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. న్నారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ డీఎం కృష్ణవేణి, డీసీఎస్‌ఓ ఫైసల్‌ హుస్సేన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అవినాష్‌ వర్మ, డీపీఎం శ్రీనివాస్‌, సివిల్‌ సప్లయీస్‌ డీటీ విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ సురేష్‌బాబు, పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారులతో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పలు అంశాలపై వివరించారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement