ఇప్పపువ్వుతో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ఇప్పపువ్వుతో ఆదాయం

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..

రోజుకు 20 నుంచి 30 కిలోలు

గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వ్యాపారులు తమ వద్దకు వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అడవిలో లభించే ఇప్పపూలకు మార్కెట్‌లో డిమాండ్‌ బాగా ఉంది. అయినా తాము మార్కెటింగ్‌కు చేయలేకపోతున్నాం. తక్షణమే ప్రభుత్వం జీసీసీ ద్వారా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటుపడాలి.

– బరసి ఉంగయ్య,

మామిడిగూడెం, ఏటూరునాగారం

ఇప్పపువ్వుతో పౌష్టికాహారం

ఇప్పపూలను వండుకొని తింటే పౌష్టికాహారం వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు తింటాం. చుట్టాలు వస్తే అందులో ఎండు చేపలు వేసి వారికి వండిపెడుతాం. అంతేకాకుండా లడ్డూలు, సారా కూడా తయారు చేసి విక్రయిస్తాం. ఇళ్లలో నిల్వ చేసుకునేందుకు డ్రమ్ములు, గుమ్ములను ఉపయోగిస్తాం.

– వేకో సోని, గంటలకుంట, ఏటూరునాగారం

మామిడిగూడెంలో ఆరబెట్టిన ఇప్పపువ్వు

ఏటూరునాగారం: ఏజెన్సీలోని అటవీ ప్రాంతాల్లో ఇప్పపువ్వు సేకరణ జాతర నెలకొంది. వేసవిలో విరివిరిగా లభించే పూలను సేకరించే పనుల్లో గిరిజనులు నిమగ్నమయ్యారు. వాటిని సేకరించి తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, ఎస్‌ఎస్‌ తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని 51 గూడేల్లోని గిరిజనులు అత్యధికంగా ఇప్పపూలు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఇలా నిల్వ చేసిన అనంతరం వాటిని లడ్డూలు, సారాయి తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే సేకరించిన ఇప్పపువ్వును భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఆదాయం పొందుతున్నారు.

ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలి..

గిరిజన సహకార సంఘం (జీసీసీ) అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. కాని సదరు అధికారులు దృష్టి సారించడం లేదు. గతంలో జీసీసీ అధికారులు గూడేల్లోకి వచ్చి ఇప్పపువ్వు కొనుగోలు చేసి ఆర్థికాభివృద్ధి సాధించేలా తోడ్పాటు అందించేవారు. ఇప్పటికై నా జీసీసీ అధికారులు గొత్తికోయగూడేల్లో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

అడవిలో ఇప్పపువ్వు ఏరుతున్న మహిళ

అటవీ ప్రాంతాల్లో విరివిగా ఇప్పపువ్వు లభిస్తుండడంతో గిరిజనులు ఎక్కువగా సేకరణపై దృష్టి పెట్టారు. ఒక్కో కుటుంబం రోజుకు 20 నుంచి 30 కిలోల వరకు సేకరించి ఎండబెడుతున్నారు. అలా 30 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత డ్రమ్ములు, గుమ్మిల్లో నిల్వ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా బంధువులు వస్తే వారికి వండిపెడుతామని చెబుతున్నారు. ఇదే కాకుండా సారా కూడా తయారు చేసి బయటకు పంపించి లీటర్‌కు రూ.100ల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అఆగే ఇప్పపువ్వును కిలోకు రూ.10 నుంచి 30 వరకు విక్రయిస్తూ మధ్యంతర ఆదాయం పొందుతున్నారు. అలా వచ్చిన ఆదాయంతో ఇంటికి కావాల్సిన సరుకులు, బట్టలు, ఆహార ధాన్యాలను వంటివి కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement