ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికపై మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో బుధవారం కళాజాతా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలంగాణ సాంస్కృతిక సారథి టీమ్ కోఆర్డినేటర్ రాగుల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, మత్తు పదార్థాల నివారణకు, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెల్లడించారు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, నేటి నుంచి నిర్వహించబోయే గ్రామ సభల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కళాకారులు వివరించారు. కార్యక్రమంలో కళాకారులు రహీముద్దీన్, విజయ్, కిషన్, భాస్కర్ పాల్గొన్నారు.


