
ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు
ములుగు రూరల్: ధాన్యం కొనుగోళ్లు ప్రణాళికతో చేపట్టాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు సూచించారు. ఈ మేరకు బుధవారం వారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరిసాగు అవుతుందని తెలిపారు. వానాకాలం వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం రవాణా కాంట్రాక్ట్ ఖరారు చేసే ముందు సరిపడా వాహనాలు సరఫరా పంపించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు , గన్నీబ్యాగులు, వెయింగ్ మిషన్‌లు, ప్యాడి క్లినర్‌లు సిద్ధంగా ఉంచాలని వివరించారు. ధాన్యం కొనుగోళ్ల అనంతరం 48 గంటల నుంచి 72 గంటల మధ్య రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి షా ఫైజల్ హేస్సేని, మేనేజర్ రాంపతి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్,జిల్లా సహకార అధికారి సర్థార్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావు