
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు షెడ్లలో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.