
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం.
– ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి..
పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు మ నోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే న్యాయం పోరాటం చే యాలి. బెదిరింపులకు పాల్ప డుతూ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛ హరించడమే. ఏపీ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలి.
– ఆడెపు రవీందర్, అధ్యక్షుడు దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం, వరంగల్
అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులుపెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథనాలతో అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. సాక్షిపై కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి.
– గుగ్గిళ్ల పీరయ్యమాదిగ,
ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి

భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..