
విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి
● కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డ్డినేటర్ రమేశ్
ములుగు రూరల్: విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ రమేశ్ సూచించారు. మండల పరిధిలోని జగ్గన్నపేట బాలికల ఆశ్రమ కళాశాలలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కళాశాలలో ఏర్పాటు చేసి విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించడం హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, కళాశాల విద్యార్థినులు అధ్యాపకులు పాల్గొన్నారు.