
వేధింపులు మానుకోవాలి..
నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
– గుగులోత్ భీమానాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇబ్బందులకు గురిచేయడం సరికాదు..
వెంకటాపురం(కె): అధికారం ఉందనే అహంకారంతో జర్నలిస్టులు, మీడియా సంస్థను ఇబ్బందులకు గురిచేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సరికాదు. జర్నలిస్టుల గళాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్న చర్యలు తక్షణమే మానుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని సాక్షి జర్నలిస్టులు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదు
– పర్శిక సతీశ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్‌ఘన్‌పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. నాలుగో స్తంభమైన పత్రికారంగంపై దాడి అనాగరికం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు సరికాదు.
– మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్
జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్

వేధింపులు మానుకోవాలి..