
నేడు దీపావళి
ప్రమిదలు కొనుగోలు చేస్తున్న ప్రజలు
ఏటూరునాగారంలో వెలిసిన బాణసంచా దుకాణాలు
ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం దీపావళి పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం ములుగు, ఏటూరునాగారం, మంగపేటతో పాటు మండలాల్లోని దుకాణాల వద్ద బాణసంచా, ప్రమిదలు, బంతిపూలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడి వాతావరణం నెలకొంది. అంతేకాకుండా కేదారేశ్వర నోములు నోచుకునే వారు సోమవారం, కొత్త నోములు నోచుకునే వారు స్వాతి నక్షత్రం మంగళవారం రోజున నోముకుంటున్నారు. సంప్రదాయం ప్రకారం భక్తులు కేదారేశ్వర స్వామివారి వ్రతాలను ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

నేడు దీపావళి

నేడు దీపావళి