
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా నవీన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని కాటాపూర్ గ్రామానికి చెందిన బెల్లంకొంండ నవీన హైదరాబాద్ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఆదివారం నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర వాణిజ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నవీన గ్రూపు– 3, 4 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు ఎంపికై ంది. నవీన భర్త తడక కరుణాకర్ సెంట్రల్ ఎకై ్సజ్ జీఎస్టీ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త ప్రోత్సాహంతో చైన్నెలో ఉంటూ ఎటువంటి కోచింగ్ లేకుండా చదివి విజయం సాధించినట్లు నవీన తెలిపారు. ఈ సందర్భంగా నవీనను కాటాపూర్ గ్రామస్తులు, బంధువులు అభినందించారు.
‘ఏఐటీయూసీ వైఫల్యాలతో అన్యాయం’
భూపాలపల్లి అర్బన్: మైనింగ్ స్టాఫ్‌కు కొంతకాలంగా జరుగుతున్న అన్యాయానికి కారణంగా ఏఐటీయూసీ గుర్తింపు సంఘం వైఫల్యమేనని టీబీజీకేఎస్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ రత్నం అవినాష్, మైనింగ్‌స్టాఫ్ ఇన్‌చార్జ్ చీకటి వంశీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘం మైనింగ్ స్టాఫ్ సమస్యల విషయంలో సవితి తల్లి ప్రేమ చూపిస్తూ మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరపకుండా టీబీజీకేఎస్‌పై విషప్రచారం చేస్తూ కాలం గడుపుతోందని ఆరోపించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో జేఎంఈటీలకు ఓవర్‌మెన్ ప్రమోషన్లు ఆలస్యం లేకుండా ఇప్పించినట్లు తెలిపారు.
గంజాయి స్వాధీనం
కాటారం: గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పట్టుకొని వారి దగ్గర నుంచి 1.57 కేజీల గంజాయిని ఆదివారం పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టంపేట గ్రామానికి చెందిన సుతారి శ్రీకాంత్, కమలాపూర్ గ్రామానికి చెందిన సోహెల్, మద్దులపల్లికి చెందిన మేకల అజయ్ కాటారం మండలంలోని పోతుల్వాయి బ్రిడ్జి వద్ద గంజాయి సేవిస్తున్నారు. అటువైపుగా వెళ్తున్న ఎస్సై శ్రీనివాస్ అనుమానంతో వారిని ప్రశ్నించగా అజయ్ పారిపోయాడు. శ్రీకాంత్, సోహెల్‌ను విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద 1.57 కేజీల గంజాయి గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. గంజాయితో పాటు ఒక మొబైల్ స్వాధీనపర్చుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీకాంత్, సోహెల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వివరించారు.
ప్రాచీన వైద్యంతో మెరుగైన జీవనం
భూపాలపల్లి రూరల్: ప్రాచీన వైద్య పద్ధతుల ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కురిమిళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధన్వంతరి వైద్య నారాయణ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై వైద్య నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్, పిప్పాల రాజేందర్ పాల్గొన్నారు.
● 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ
● టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్‌కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో 318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్‌కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్‌లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్‌లో 1,577, వరంగల్ రూరల్‌లో 910, జనగామలో 950, మహబూబాబాద్‌లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం..
వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్‌గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు.
రూ.320.7 కోట్ల టార్గెట్..
2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్‌ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది.
వైన్స్
2025–27
దరఖాస్తులు
2023–25
దరఖాస్తులు
ఆదాయం
(రూ.కోట్లలో)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి మీడియా గొంతునొక్కడం అప్రజాస్వామికమని పలు ప్రజాసంఘాల నాయకులు అన్నారు. సాక్షి దినపత్రికపై దాడులు చేస్తూ, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న సర్కారు వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. – సాక్షి నెట్‌వర్క్
సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు సరికాదు
తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
గ్రామాల్లో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
నెలరోజుల పాటు గడువు
జిల్లాలో 1,11,405 మూగజీవాలు
దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులే..
వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది.

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం