
బూత్‌స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: బూత్ స్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించిగా కలెక్టర్ టీఎస్ దివాకర, ఆర్డీఓ వెంకటేశ్‌లు పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం స్పెష ల్ ఇన్సెంటివ్ రివిజన్ చేట్టాలన్నారు. ఎస్‌ఐఆర్ నిర్వాహణకు ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002, ఎస్‌ఐఆర్ 2025తో పోల్చి చూడాలన్నా రు. 2002 తర్వాత నమోదైన ఓటరు నమోదును క్షేత్రస్థాయిలో ధ్రువీకరించాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిట్నరింగ్ అధికారి, ఏఈఆర్‌ఓ, డిప్యూటీ తహసీల్ధార్లు, బీఎల్‌ఓ, సూపర్‌వైజర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. లక్ష్యాలను నిర్ధేశించుకొని ఎస్‌ఐఆర్ చేపట్టేలా కార్యచరణ తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ విజయభాస్కర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సలీం, అధికారులు పాల్గొన్నారు.