
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని కేజీబీవీకి చెందిన నాగేశ్వరి సబ్ జూనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో నాగేశ్వరి ప్రతిభ కనబర్చడంతో నిర్వాహకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి చల్ల సునీత తెలిపారు. ఈ నెల 25నుంచి 28వరకు నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్‌ఓ పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని ఎస్‌ఓతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏరియా స్థాయి లాల్ టెన్నస్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా సర్వే అధికారి శైలేంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాదని ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, కెప్టెన్‌లు మల్లేష్, శ్రీరాములు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక