
రహదారులు ఇలా.. వెళ్లేదెలా?
● ఎన్‌హెచ్ 163పై అడుగడుగునా గుంతలు
● ఇసుక లారీల టైర్ల అచ్చులు
● ప్రమాదాల బారిన పడుతున్నా..
పట్టించుకోని అధికారులు
గోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలోని జాతీయ రహదారి అధ్వానంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక లారీల రాకపోకలతో టైర్ల అచ్చులు పడడంతో పాటు 163 జాతీయ రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు ఇలా ఉంటే వెళ్లేదెలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలువురు ప్రమాదాల బారిన పడినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
20 కిలో మీటర్లు గుంతలు
గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా, గోవిందరావుపేట, చల్వాయి, ఎస్‌ఎస్ తాడ్వాయి రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. గోవిందరావుపేట మండలంలోని మచ్చాపూర్ గ్రామం నుంచి పస్రా చివరి వరకు సుమారు 20 కిలోమీటర్ల మార్గం పూర్తిగా గుంతలు, లారీ టైర్ల అచ్చులతో ప్రమాదభరితంగా మారింది. వర్షాలు పడితే ఈ గుంతలు చిన్నచిన్న చెరువుల్లా మారిపోతున్న పరిస్థితి. నీళ్లు ఉన్న సమయంలో గుంతలను గుర్తు పట్టలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు.
భూపాలపల్లి నుంచి బయ్యక్కపేట మీదుగా..
రోడ్ల ధ్వంసంతో మేడారం దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట దారిలో రోడ్లు ఽధ్వంసమై గుంతలను తలపిస్తున్నాయి. భూపాలపల్లి నుంచి బయ్యక్కపేట మీదుగా ప్రైవేటు వాహనాల్లో ఆది, బుధ, గురు, శుక్రవారాల్లో మేడారానికి భక్తులు ఈ రోడ్డు మార్గన వస్తుంటారు. బీటీ రోడ్లు భారీగా దెబతిన్నడంతో రాత్రి వేళలో మేడారానికి వచ్చే వాహనాదారులు అదమరిచి గుంతల్లో పడితే ప్రమాదాల భారీన పడే అవకాశం ఉంది. బయ్యక్కపేట నుంచి గోవిందరావుపేట మండలంలోని పస్రా, నార్లాపూర్‌కు పనుల నిమిత్తం ద్విచక్ర వాహనాలపై వస్తుంటారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తాడ్వాయి– పస్రా మార్గంలో రోడ్లు దెబ్బతిన్నడంతో ఇసుక లారీలను తాడ్వాయి నుంచి మేడారం, నార్లాపూర్ మీదుగా ఇసుక లారీలు బయ్యక్కపేట నుంచి భూపాలపల్లి వైపు వెళ్లడంతోనే రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి.

రహదారులు ఇలా.. వెళ్లేదెలా?

రహదారులు ఇలా.. వెళ్లేదెలా?

రహదారులు ఇలా.. వెళ్లేదెలా?