
యూరియా కష్టాలు
ములుగు రూరల్: మండల పరిధిలోని బండారుపల్లిలో రైతులు యూరియా బస్తాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సమయంలో బండారుపల్లి గ్రామానికి 330 బస్తాలను పంపించారు. లారీ సాయంత్రం 5 గంటలకు చేరితే పీఏసీఎస్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు సాయంత్రం 6.30 గంటలకు పంపిణీ చేసేందుకు వెళ్లారు. సాయంత్రం సమయంలో వర్షం సైతం పడడంతో కొంత ఆలస్యమైంది. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.45గంటల వరకు విద్యుత్ అంతరాయంతో అధికారులు రైతులకు యూరియా బిల్లులు పెట్టడానికి సెల్‌ఫోన్ లైట్ వెలుగులో బిల్లులు రాశారు. రైతులు చీకట్లో యూరియా బస్తాల కోసం పడిగాపులు కాశారు.