
గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
గోవిందరావుపేట: ముంపు గ్రామాల్లో 15 రోజులలోపు డెలవరీకి ఉన్న గర్భిణులను వెంటనే సురక్షిత ప్రాంతానికి లేదా పీహెచ్‌సీలోని బర్త్ వెయిటింగ్‌హాల్‌లోకి తరలించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్ లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. జ్వరాలు ఉన్న గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలన్నారు. మలేరియా వ్యాధుల నియంత్రణలో భాగంగా కిట్లను, కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా వ్యాధి నిర్ధారణ చేసే ఆర్డీటీ కిట్లను, మందులను మూడు నెలలకు సరిపోయే విదంగా ఉండేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా అధికారి చంద్రకాత్, ప్రోగ్రాం ఆధికారి శ్రీకాంత్, సూపర్‌వైజర్ హేమలత, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.