
జ్వరాలపై దృష్టి పెట్టాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/మంగపేట: జ్వరాలపై వైద్యులు, సిబ్బంది దృష్టిపెట్టాలని ఆరోగ్యశాఖ కీటక జనిత నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్‌సింగ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఏటూరునాగారం సామాజిక ఆరోగ్య కేంద్రం, బ్లడ్ బ్యాంక్, మంగపేట, చుంచుపల్లి పీహెచ్‌సీలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమర్‌సింగ్ మాట్లాడుతూ ఏజెన్సీలో డెంగీ, మలేరియా వచ్చే హైరిస్క్ గ్రామాలు ఉన్నందున విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అలసత్వం ప్రదర్శించకుండా వైద్యసేవలు అందించాలని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న వారికి డెంగీ, మలేరియా, ఆర్టిటీ, ఎలిషా పరీక్షలు చేయాలని అన్నారు. బ్లడ్ బ్యాంకులో అన్ని గ్రూపులకు సంబంధించిన రక్త నిల్వలను ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విఫిన్‌కుమార్, జిల్లా కీటక జనిత నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్, సైదులు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అడిషనల్ డైరెక్టర్ గఫూర్, టీహబ్ నోడల్ ఆఫీసర్ ప్రవీణ్, ఏఎంఓ దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రసాద్ పాల్గొన్నారు.
కీటక జనిత నియంత్రణ
అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్‌సింగ్