
నాణ్యమైన విద్య అందించాలి
ములుగు రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర పరిశీలకుడు, ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎంఈఓలు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6, 7 తేదీలలో ప్రాథమిక పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విద్యార్థులకు చేరేలా చూడాలని అన్నారు. ఉల్లాస్ రిసోర్స్ పర్సన్‌ల శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్ అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గ్యాదరి రమాదేవి, సాంబయ్య, వయోజన విద్య నోడల్ ఆఫీసర్ వేణుగోపాల్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.