
ఈఓ కార్యాలయంపై పట్టింపేది?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అనుగుణంగా వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఐటీడీఏ కార్యాలయం మాత్రమే నిర్మించారు. ప్రస్తుతం రెవెన్యూ, అతిథిగృహం, పీఆర్ గెస్ట్‌హౌస్, పూజారుల భవనం నిర్మించారు.. ఇలా అన్ని వసతులు ఉన్నా ఈఓ కార్యాలయ భవన నిర్మాణం గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఏళ్లు గడస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఏడాది పొడువునా భక్తులే..
మేడారంలో రెండేళ్లకోసారి ఏడాది మధ్యలో జరిగే చిన్న జాతర సమయంలోనూ కోటి మందికిపైగా భక్తులు హాజరవుతున్నారని అధికారుల అంచనా. మహాజాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా మేడారానికి భక్తులు తరలిస్తున్నారు. బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సుమారుగా ఐదు వేల మందికిపైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కానుకల ద్వారా అదాయం వస్తున్నా దేవాదాయశాఖ అధికారులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కనీసం భక్తులకు తాగునీటి వసతి కూడా కల్పించకపోవడం గమనార్హం.
మీడియా పాయింటే.. ఈఓ కార్యాలయం
మేడారంలో మీడియా పాయింట్ మంచె ఈఓ కార్యాలయంగా మారింది. ప్రస్తుతం ఉన్న జాలి గదిని సైతం గత జాతరలో కూల్చివేశారు. ఆరు జాతరలకు రెగ్యులర్ ఈఓలను నియమించకుండా ఇన్‌చార్జ్‌లను నియమించడంతోనే ఆలయ అభివృద్ధి వెనుకబాటుకు కారణమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.
మేడారంలో భవన నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం
ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని సర్కారు
హనుమకొండలోని ధార్మిక భవనంలోనే మేడారం ఈఓ కార్యాలయం
హనుమకొండలోని ధార్మిక భవనంలోనే..
భక్తుల సౌకర్యాలపై ధర్మాదాయ దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణంపై ఏళ్లు గడుస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతర 2006లో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. స్వరాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఈఓ కార్యాలయం మాత్రం నిర్మాణానికి నోచుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హనుమకొండలో నిర్మించి న ధార్మిక భవనంలోనే మేడారం ఈఓ కార్యాల యం కొనసాగుతోంది. అక్కడి నుంచే జాతర నిర్వహణ కార్యకలాపాలను నడిపిస్తున్నారు. జాతర పనుల నిమిత్తం మాత్రమే దేవాదాయశాఖ అధికా రులు మేడారానికి వస్తున్నారే తప్పా మిగితా రోజు లన్నీ కార్యాలయానికే పరిమిత మమవుతున్నారు.
ఈఓ కార్యాలయం నిర్మించాలి..
మేడారంలో ఈఓ కార్యాలయం నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. మహాజాతర సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా మేడారానికి భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. ఎండోమెంట్ కార్యాలయం నిర్మించడం వల్ల భక్తులకు దేవాదాయశాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఈ సారి మహాజాతర నాటికి మేడారంలో ఈఓ కార్యాలయం ఏర్పాటు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సిద్ధబోయిన స్వామి, సమ్మక్క పూజారి

ఈఓ కార్యాలయంపై పట్టింపేది?