
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
వెంకటాపురం(ఎం): ఆయిల్‌పామ్ తోటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సంజీవరావు అన్నారు. మండల కేంద్రంలో కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ బుధవారం నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన నరెడ్ల శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో ఐదెకరాల విస్తీర్ణంలో ప్లాంటేషన్ ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఎకరానికి రూ.1140 లు చెల్లిస్తు రైతులకు 57 మొక్కలు అందిస్తామన్నారు. నాలుగేళ్ల వరకు ఎకరానికి రూ.4,200 చొప్పున అంతర పంటల సాగుకు ఇస్తారని తెలిపారు. జిల్లాలో 2022–23లో 820 ఎకరాలు, 2023–24లో 834 ఎకరాలు, 2024–25లో 909 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంటలు సాగు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 343 ఎకరాల్లో అయిల్‌పామ్ సాగు అయినట్లు వెల్లడించారు. నాలుగవ సంవత్సరంలో మొదటి కోత 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. 7వ సంవత్సరం నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు. ఎరువుల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులను రైతులు అవలంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధికారి శ్రీకాంత్, ఉద్యాన విస్తీర్ణ అధికారి రమేష్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి
సంజీవరావు