వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న | - | Sakshi
Sakshi News home page

వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న

Jun 15 2025 7:32 AM | Updated on Jun 15 2025 7:32 AM

వందలా

వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న

ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

జఫర్‌గఢ్‌: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్‌ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు ఇన్నయ్యను నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.

న్యూస్‌రీల్‌

వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న1
1/2

వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న

వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న2
2/2

వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement