‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి’ | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి’

May 7 2025 12:40 AM | Updated on May 7 2025 12:40 AM

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి’

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి’

ములుగు రూరల్‌: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తాచాటాలని ఆపార్టీ మెదక్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ తాడూరి శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాయలంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్‌ పెసరు విజయచందర్‌రెడ్డి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిందన్నారు. పార్టీ నాయకులు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజల్లోకి తీసుకుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం నాయకులు భాస్కర్‌రెడ్డి, జవహర్‌, సురేందర్‌, నాగరాజు, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement