
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి (YVS Chowdary) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కూచిపూడి డ్యాన్సర్ అయిన ఆమె తెలుగమ్మాయి కావడం విశేషం.
హీరోహీరోయిన్లుగా వారిద్దరిని వై.వి.ఎస్.చౌదరి చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్’ చిత్రంతో సాయిధరమ్ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశారు. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1980 నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం వంటి అంశాలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. ఆస్కార్ విజేతలు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ (Chandra Bose) సంగీత, సాహిత్యాలను అందిస్తున్నారు. ఆపై సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. నందమూరి తారకరామారావు నటించిన 'తోడు నీడ' సినిమా విడుదలై మే 12వ తేదీకి 60 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరగడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది.