Why Jr NTR, Allu Arjun Not Attended Ram Charan Birthday Party - Sakshi
Sakshi News home page

Ram Charan-Jr NTR: చరణ్‌ బర్త్‌డే పార్టీలో కనిపించని తారక్‌.. ఎందుకు రాలేదు?

Mar 28 2023 11:35 AM | Updated on Mar 28 2023 12:05 PM

Why Jr NTR, Allu Arjun Not Attending Ram Charan Birthday Party - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. సోమవారం (మార్చి 27న) చరణ్‌ బర్త్‌డే సందర్బంగా గ్రాండ్‌ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి టాలీవుడ్‌ సినీ ప్రముఖులంత సందడి చేశాడు. డైరెక్టర్‌ రాజమౌళి, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, విక్టరి వెంకటేశ్‌, అడివి శేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనగా.. కాజల్‌ భర్తతో కలిసి వచ్చింది. అలాగే మంచు తన భార్య మౌనికతో కలిసి చరణ్‌ బర్త్‌డే పార్టీలో సందడి చేశాడు. అలా యంగ్‌ హీరోల నుంచి అగ్ర దర్శక-నిర్మాతలకు పలువురు చరణ్‌ పుట్టిన రోజు వేడుకలో మెరిశారు.

చదవండి: చరణ్‌ బర్త్‌డే పార్టీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మంచు మనోజ్‌-మౌనిక జంట

అయితే ఈ పార్టీలో ఎక్కడా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌లు కనిపించకపోవడం గమనార్హం. ఇండస్ట్రీలో తారక్‌తో మొదటి నుంచే చరణ్‌కు మంచి అనుబంధం ఉంది. ఇద్దరు సొంత సొదురులా కలిసిపోయి ఉంటారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరి అనుబంధం మరింత బలపడింది. వీరి సన్నిహిత్యం ఎలా ఉందో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్లో అందరు చూశారు. అయితే అంతగా క్లోజ్‌గా ఉండే తారక్‌, చరణ్‌ బర్త్‌డే పార్టీకి రాకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో అభిమానులంత ఆరా తీస్తున్నారు. షూటింగ్‌ వల్లే తారక్‌ బర్త్‌డే పార్టీకి రాలేదని తెలుస్తోంది.

చదవండి: నటి హరితేజ షాకింగ్‌ లుక్‌ వైరల్‌.. ఇలా మారిపోయిందేంటి?

కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేయబోయే  NTR30 మూవీ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్‌ రాత్రి వేళ ఉండటంతో తారక్‌ రాలేకపోయాడట. మరోవైపు బన్నీ కూడా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కనిపించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. మెగా-అల్లు ఫ్యామిలీ అంటే ఒక్క కుటుంబంలా చూస్తారు ఫ్యాన్స్‌. సొంత కజిన్‌ అయిన బన్నీ చరణ్‌ బర్త్‌డే పార్టీలో లేకపోవడం ఏంటని మెగా-అల్లు ఫ్యాన్స్‌ అంత ఆలోచనలో పడ్డారు. అయితే పుష్ప 2 డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ పార్టీకి హాజరు కాగా.. బన్నీ పార్టీకి రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement