తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో! | Vishwak Sen Leg Injury In Gangs Of Godavari Movie | Sakshi
Sakshi News home page

Vihswak Sen: హీరో విశ్వక్ సేన్‌కి గాయం.. వీడియో వైరల్!

Published Wed, Nov 15 2023 5:06 PM | Last Updated on Wed, Nov 15 2023 5:58 PM

Vishwak Sen Leg Injury In Gangs Of Godavari Movie - Sakshi

సినిమా హీరోలు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే షూటింగ్స్‌లో చిన్నచిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో గాయపడ్డాడు. సినిమా కోసం రిహార్సల్స్ చేస్తున్న టైంలో ఇది జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం కాస్త బయటపడింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు)

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేస్తున్నాడు. గోదావరి ప్రాంతంలో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీస్తున్నారు. రాబోయే డిసెంబరు 8న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ తేదీకి వస్తుందా రాదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. మరోవైపు కొన్నాళ్ల ముందు ఈ చిత్ర షూటింగ్ రిహార్సల్స్‌లో విశ్వక్ గాయపడ్డాడట.

ఓ లారీ పైనుంచి పక్కకి దూకే సీన్ చేస్తున్న టైంలో ఓ బస్తా కాలికి తగలడంతో పట్టుజారి పక్కనే పడిపోయాడు. అయితే ఇందులో భాగంగా విశ్వక్ కాలికి గాయమైందట. ప్రస్తుతం అది తగ్గిపోయిందని, షూటింగ్‌లో కూడా విశ్వక్ పాల్గొంటున్నాడని తెలిసింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement