యంగ్ హీరో కొత్త సినిమా... ఆ స్టార్ డైరెక్టర్‌తో కలిసి | Vishnu Vishal New Movie With Director Gokul Pics Viral | Sakshi
Sakshi News home page

యంగ్ హీరో కొత్త సినిమా... ఆ స్టార్ డైరెక్టర్‌తో కలిసి

Jan 9 2024 2:58 PM | Updated on Jan 9 2024 3:24 PM

Vishnu Vishal New Movie With Director Gokul Pics Viral - Sakshi

తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్‌ కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో 'లాల్‌ సలామ్‌'లో హీరోగా నటించాడు. ఇది జనవరి చివరి వారంలో థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు 'ఆర్యన్‌' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో కొత్త మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. 

(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)

విష్ణు విశాల్‌ హీరోగా చేస్తూనే పలు సినిమాలని నిర్మించాడు కూడా. ఇప్పుడు కూడా డైరెక్టర్ గోకుల్‌తో చేయబోయే మూవీలో నటిస్తూ నిర్మిస్తున్నాడు. రౌద్రం, కాష్మోరా లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న గోకుల్.. ఇప్పుడు విష్ణు విశాల్‌తో ఎలాంటి మూవీ తీస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ప్రారంభమైంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలని వెల్లడించనున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement