షూటింగ్‌లో ఆర్టిస్ట్‌ మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ | Actor Vishal Pays Tribute to Stuntman Raju Demise In Accident On Arya's Movie Set, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో ఆర్టిస్ట్‌ మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌

Jul 14 2025 8:07 AM | Updated on Jul 14 2025 11:44 AM

Actor Vishal Pays Tribute to Stuntman Raju Demise

ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వెట్టువన్‌. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ తమిళనాడులోని కిళైయూర్‌ కావల్‌ సరగమ్‌ సమీపంలో విళుందమావడి గ్రామంలో గత మూడు రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం షూటింగ్‌లో పాల్గొన్న మోహన్‌ రాజు అనే స్టంట్‌ కళాకారుడు కారులో నుంచి బయటకు దూకుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.

స్టంట్‌ కళాకారుడు మృతి
వెంటనే అతన్ని నాగపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రాజు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన స్టంట్‌ కళాకారుడు మోహన్‌ రాజు వయసు 52 ఏళ్లు. ఈయన మృతి వెట్టువన్‌ చిత్ర యూనిట్‌నే కాకుండా సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టంట్‌ కళాకారుడు మోహన్‌ రాజు మృతి పట్ల హీరో విశాల్‌ (Vishal) సంతాపం ప్రకటించారు.

ప్రమాదకర స్టంట్లు
సినిమా షూటింగ్‌లో కారులో నుంచి దూకుతూ స్టంట్‌ కళాకారుడు రాజు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. రాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎంతో ధైర్యశాలి. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కేవలం ఒక్క ట్వీట్‌ చేసి నా పని నేను చేసుకోలేను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు.

ఫైట్‌ మాస్టర్‌ ట్వీట్‌
ఫైట్‌ మాస్టర్‌ సిల్వ స్టంట్‌.. రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్‌ స్టంట్‌ ఆర్టిస్ట్‌ను కోల్పోయాం. స్టంట్‌ యూనియన్‌, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. అతడిని మిస్‌ అవుతున్నాం అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్‌ చేశాడు.

 

చదవండి: సకల సినీ పాత్రలకు పెట్టని కోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement