కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సన్నివేశంలోనైనా నటించేందుకు సిద్ధమే అంటుంటారు తారలు. కొందరు మాత్రం అసభ్యత, అశ్లీలతకు ఇసుమంత చోటు కూడా ఇవ్వని సినిమాలే చేస్తామంటారు. మరికొందరు మాత్రం మూడో కేటగిరీ.. ఫస్ట్ సీన్‌లో నటిస్తారు.. తర్వాత మళ్లీ మనసు మార్చుకుని అది లేకపోయుంటే బాగుండంటూ లోలోనే మథనపడుతుంటారు. వారి ఇబ్బందిని గమనించి ఆయా సీన్లను ఎత్తేసేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.
హీరోయిన్ అభ్యంతరం
హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ఇప్పుడదే పని చేశాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్. శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ఈ మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది. అందులో ఒక ముద్దు సన్నివేశం షూట్ చేశాం. అంతా అయిపోయాక దానిపై మానస (Maanasa Choudhary) అభ్యంతరం చెప్పింది. ఆ సీన్‌ను తీసయమని దర్శకుడిని కోరింది.
కత్తిరించేశాం
అదే మాట డైరెక్టర్ నాకొచ్చి చెప్పాడు. తన ఇబ్బంది నాకర్థమైంది. సరే, ఆ సీన్ తీసేద్దాం.. అది లేకుండా డిఫరెంట్‌గా పాటను పూర్తి చేద్దాం అని చెప్పాను. సినిమా ఫైనల్ ఎడిటింగ్‌లో ఆ సన్నివేశాన్ని కత్తిరించేశాం అని చెప్పుకొచ్చాడు. మానస చౌదరి తెలుగమ్మాయి. చిత్తూరుకు చెందిన ఈ బ్యూటీ.. యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన బబుల్‌గమ్ మూవీతో తెరంగేట్రం చేసింది. లక్కీ భాస్కర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఆర్యన్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.
చదవండి: ట్రెండింగ్‌లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా?


