Rangam: శింబు - కార్తీక ఫొటోలు వైరల్‌, ఎందుకంటే?

Viral Pics: Shocking Reason Behind Jiiva Replaced By Simbu In Ko Movie - Sakshi

సూర్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అయాన్‌'. తెలుగులో వీడొక్కడే పేరుతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దర్శకుడు కేవీ ఆనంద్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూనే ఆ వెంటనే 'కో' సినిమాను ప్రకటించాడు ఆనంద్‌. ఇది తెలుగులో 'రంగం' పేరుతో విడుదై సెన్సేషనల్‌ హిట్‌ సాధించింది. అయితే ఇక్కడో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో మొదట హీరోగా అనుకుంది జీవాను కాదు శింబును!

శింబుతో 'కో' సినిమా తీస్తున్నట్లు చిత్రయూనిట్‌ అధికారంగా ప్రకటించింది. అంతే కాదు, ఇంకొన్ని రోజుల్లో షూటింగ్‌ మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో శింబు-కార్తీక నాయర్‌లపై ఫొటోషూట్‌ కూడా నిర్వహించారు. ఇక సినిమా పట్టాలెక్కే సమయానికి మాత్రం శింబు ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో దర్శకుడు శింబు ప్లేస్‌లో యంగ్‌ హీరో జీవాను తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగా అఖండ విజయం సాధించిన ఈ సినిమా రిలీజై దాదాపు పదేళ్లు దాటిపోయింది. ఈ సమయంలో తాజాగా శింబు-కార్తీక ఫొటోషూట్‌కు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..
'కో' సినిమా చేసేందుకు శింబు రెడీ అన్నాడు. కాకపోతే హీరోయిన్‌గా కార్తీకకు బదులు తమన్నా కావాలని అడిగాడట. కానీ ఆ సమయంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ పెద్దమొత్తంలో పారితోషికం అందుకుంటున్న మిల్కీ బ్యూటీని ఈ ప్రాజెక్టుకు ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు దర్శకనిర్మాతలు. తమన్నా కోరినంత రెమ్యుననరేషన్‌ ఇచ్చేంత భారీ బడ్జెట్‌ తమ వద్ద లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో దర్శకుడు, హీరో మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడటంతో శింబు ప్రాజెక్ట్‌ నుంచి సైడ్‌ అయినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి.

చేసేదేం లేక దర్శకుడు కూడా మరో మంచి నటుడు కోసం వెతుకుతుండగా జీవా కంటపడ్డాడు. అలా అతడికి కో మూవీలో చాన్స్‌ రాగా అది జీవా కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రెండు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు, మూడు విజయ్‌, రెండు సీమా, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం విశేషం.

చదవండి: Anushka Shetty: వైరలవుతున్న స్వీటీ ఫొటో

సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top