ఇంటర్నెట్‌లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా! | #AiraneVanchalaEnti: Vijay Deverakonda Latest Movie Family Star Trending In Twitter- Sakshi
Sakshi News home page

Family Star: 'ఐరనే వంచాలా ఏంటి?'.. ఇప్పుడిదే ట్రెండ్!

Published Thu, Oct 26 2023 7:33 PM

Vijay Devarakonda latest Movie Family Star Trending In Twitter - Sakshi

విజయ్‌ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్‌. ఈ మూవీని దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరోసారి ‍జతకట్టారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్‌ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

(ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?)

అయితే ఈ మూవీ  గ్లింప్స్‌లో..' ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?’ అని విజయ్‌ విలన్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. ప్రస్తుతం 'ఐరనే వంచాలా ఏంటి' అనే డైలాగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ఈ డైలాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. ఈ డైలాగ్‌ను సైతం విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.

అయితే ఈ డైలాగ్‌కు ప్రభాస్ మిర్చి సినిమాలో విలన్‌తో ఫోన్‌లో మాట్లాడే డైలాగ్‌ను జోడించారు. ఇంటర్నెట్‌.. అసలు ఏం నడుస్తోంది? అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు ఈ ఐరన్‌ డైలాగ్‌ను జతచేసి పోస్ట్‌ చేయడంతో ఐరనే వంచాలా ఏంటి(#Airanevanchalaenti), ఫ్యామిలీ స్టార్ (#FamilyStar) ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఏకంగా పోస్టర్‌నే రిలీజ్‌ చేసింది.

(ఇది చదవండి: వరుణ్‌తేజ్‌- లావణ్యల శుభలేఖ ఫోటో చూశారా? ఆరోజే రిసెప్షన్‌!)

అయితే దీని వెనుక మరో కారణం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఐరన్‌ డైలాగ్‌, విజువల్స్‌ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్‌.. వాటిని తిప్పికొట్టేందుకు టీమ్‌ ఇలా ప్లాన్‌ చేసిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. 

 
Advertisement
 
Advertisement