
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మినిమమ్ క్రేజ్ ఉంటుంది. ఈసారి తమిళనాడు వరకు ఓకే గానీ తెలుగులో పెద్దగా హడావుడి లేకుండానే 'వేట్టయన్' రిలీజైపోయింది. దసరా కానుకగా ఈ గురువారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే మిక్స్‌డ్ టాక్ వినిపించింది. వీకెండ్ గడిస్తేగాని అసలు టాక్ ఏంటనేది బయటపడదు.
(ఇదీ చదవండి: రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)
మరోవైపు 'వేట్టయన్' చిత్రానికి తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వచ్చినట్లు టాక్. తమిళనాడులోనే రూ.22 కోట్లు, దేశంలో మిగిలిన చోట్లన్నీ కలిపి రూ.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.23 కోట్లు వచ్చాయని సమాచారం. తెలుగు వరకు అయితే దాదాపు రూ.3 కోట్లు వరకు వచ్చిన సమాచారం.
తెలుగులో అయితే 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' లాంటి సినిమాలు రిలీజయ్యాయి. అలానే 'జిగ్రా', 'మార్టిన్' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా తాజాగా థియేటర్లలో రిలీజయ్యాయి. వీటని దాటుకుని 'వేట్టయన్' తెలుగులో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. తొలిరోజు అయితే పర్లేదనిపించింది గానీ వీకెండ్ ముగిసేసరికి ఎన్ని డబ్బులు వస్తాయనే దానిబట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.
(ఇదీ చదవండి: బొమ్మ పడలేదు.. కొత్త సినిమాలకు రిలీజ్ సమస్యలు!)