
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో డాక్టర్ భ్రమరం పాత్రలో ‘వెన్నెల’ కిశోర్(Vennela Kishore) నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
‘‘ఒక కాంటెంపరరీ ఇష్యూను వినోదాత్మకంగా చూపిస్తూ, ‘సంతానప్రాప్తిరస్తు’ మూవీని రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో గర్భగుడి వెల్‌నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం తన దగ్గరకు సంతాన లేమి సమస్యలతో వచ్చే వారిని ఆయుర్వేద వైద్యాన్ని, మోడ్రన్ మందులతో కలిపి ఎలా ట్రీట్ చేశాడు? అనే అంశాలు హిలేరియస్‌గా ఉంటాయి. భ్రమరం పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్విస్తాయి’’ అని యూనిట్ తెలిపింది.