Fear Movie: భయపెట్టడానికి రెడీ అవుతున్న వేదిక! | Vedika Suspense thriller Fear Movie launched grandly with pooja ceremony | Sakshi
Sakshi News home page

Fear Movie: భయపెట్టడానికి రెడీ అవుతున్న వేదిక!

Jan 17 2024 4:05 PM | Updated on Jan 17 2024 4:05 PM

Vedika Suspense thriller Fear Movie launched grandly with pooja ceremony - Sakshi

కాంచన, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్‌ వేదిక. ఆమె ప్రధాన పాత్రలో ఓ సస్పెన్స్‌ , థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతుంది. హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌  పాల్గొని స్క్రిప్ట్ అందించగా...డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. 

ఈ సందర్భంగా హీరోయిన్‌ వేదిక మాట్లాడుతూ.. ‘ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది’ అన్నారు. డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ ..‘ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అనేది ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను.

ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది. మంచి టీమ్ నాకు దొరికింది. వీరి సహాయంతో నేను అనుకున్న స్క్రిప్ట్ తో ఇన్ టైమ్ లో సినిమా రూపొందించి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఫియర్ స్క్రిప్ట్ ను హరిత చాలా బాగా రాసుకుంది. ఆ స్క్రిప్ట్ ను యాక్సెప్ట్ చేసి హరితకు సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి థ్యాంక్స్’అని నిర్మాత ఏఆర్‌ అభి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అరవింద్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ,  డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement