
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఆమె నటించిన పరమ్ సుందరి ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించింది. అంతే కాకుండా వరుణ్ ధావన్తో కలిసి సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే చిత్రంలో జాన్వీకపూర్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో
టీజర్ చూస్తే ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తునట్లు తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలో బాహుబలి గెటప్తో ప్రారంభమైంది. బాహుబలి ప్రభాస్ గెటప్‌లో వరుణ్ ధావన్ లుక్ అదిరిపోయింది. నేను అచ్చం బాహుబలిలానే ఉన్నానని వరుణ్ ధావన్ చెప్పడంతో.. నిన్ను చూస్తే రణ్వీర్ సింగ్ ధోతిని.. ప్రభాస్ ధరించినట్లు ఉందంటూ చెప్పే డైలాగ్ తెగ నవ్వులు పూయిస్తోంది. ఈ టీజర్ చూస్తే ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రోహిత్ షరఫ్, సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.
కాగా.. ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, శశాంక్ ఖైతాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజీమ్ దయాని సంగీతమందిస్తున్నారు.