ప్రముఖ నటి కూతురు.. ఫస్ట్‌ సినిమా పోస్టర్‌ విడుదల | vanitha vijayakumar daughter jovika movie agadha first look | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటి కూతురు.. ఫస్ట్‌ సినిమా పోస్టర్‌ విడుదల

Apr 30 2026 1:24 PM | Updated on May 2 2026 9:17 AM

vanitha vijayakumar daughter jovika movie agadha first look

ప్రముఖ నటి వనితా విజయ్‌కుమార్‌ కూతురు జోవిక టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా అగధ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. స్టార్‌ కిడ్‌గా గుర్తింపు ఉన్న జోవిక తమిళ్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌- 7లో కనిపించిన విషయం తెలిసిందే.. తమిళ్‌లో గతేడాది మిసెస్ & మిస్టర్  మూవీతో అలరించిన జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో రానున్న చిత్రం అగధ.. మిస్టికల్‌ డివైన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్‌ని కొద్దిరోజుల క్రితమే రివీల్‌ చేశారు.

‘‘డర్టీ హరి’ చిత్రంతో గుర్తింపు తెచ్చకున్న శ్రవణ్‌ రెడ్డికి  ఎం.ఎస్‌. రాజు. మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్‌... విస్తృతమైన సెట్‌ వర్క్‌... దాదాపు 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్‌తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement