అప్పట్లో స్టార్‌ హీరో.. పదేళ్ల గ్యాప్.. హిట్‌ పడుతుందా? | Vadde Naveen Gets Super hit with His Re entry into Tollywood | Sakshi
Sakshi News home page

Vadde Naveen: పదేళ్ల తర్వాత వడ్డే నవీన్ ఎంట్రీ.. హిట్‌ కొడతాడా?

May 22 2026 4:07 PM | Updated on May 22 2026 6:03 PM

Vadde Naveen Gets Super hit with His Re entry into Tollywood

వడ్డే నవీన్.. ఇ‍ప్పటి సినీ ప్రియులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్‌కి బాగా పరిచయమున్న హీరో. అప్పట్లో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వడ్డే నవీన్ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మరో ప్రయత్నం చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు,  స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఏమైందో తెలియదు కానీ 2010 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు అంటే 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ  జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

హిట్ కొడతాడా?

దాదాపు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో వడ్డే నవీన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ హిట్ అయితే తనకు కూడా మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లు అవుతుంది. ఇటీవల కొందరు స్టార్స్‌ రీ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది హీరో రాజశేఖర్ సైతం బైకర్‌ మూవీతో మరోసారి వెండితెరపై మెరిశారు. ఈ చిత్రం ఆయనకు బాగానే కలిసొచ్చింది. ఇప్పుడు వడ్డే నవీన్‌ కూడా కమ్ బ్యాక్‌ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ మూవీతో హిట్ పడితే వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమేనంటున్నాడు మన 90స్ హీరో. నవీన్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement