ఆరోగ్యంగా ఉందాం

Upasana Kamineni Konidela Announces Samantha As Guest Editor URLife Co In - Sakshi

‘అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటించాలనే లక్ష్యంతో ‘యువర్‌లైఫ్‌.కో.ఇన్‌’ వెబ్‌సైట్‌ను స్థాపించాను’ అన్నారు ఉపాసన కొణిదెల. ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత పేరును ప్రకటించారు ఉపాసన కొణిదెల. ఈ విషయం గురించి ఉపాసన మాట్లాడుతూ – ‘‘ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక మరియు భావోద్వేగాల సమతుల్యత వంటివి నేను నమ్మే సిద్ధాంతాలు. ఇవన్నీ అందరికీ చేరువ చేయాలని ఈ వెబ్‌సైట్‌ స్థాపించాను. ఇలాంటి ఆలోచనలే సమంత కూడా పాటిస్తున్నారు. స్వయంకృషితో ఎదిగిన సమంత ఆలోచనలు, సూచనలు మా పాఠకులకు ఉపయోగపడతాయని మేం నమ్ముతున్నాం’’ అన్నారు ఉపాసన. ‘‘జస్ట్‌ అలా కూర్చుని ఉంటే పర్ఫెక్ట్‌ కాలేం. లేవండి.. కదలండి.. ఫిట్‌ అవ్వండి’’ అన్నారు సమంత.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top