ధురంధర్‌-2కు మరో కొత్త చిక్కు | Trimurti Films Legally move On Dhurandhar 2 Songs | Sakshi
Sakshi News home page

ధురంధర్‌-2కు మరో కొత్త చిక్కు

Apr 9 2026 1:08 PM | Updated on Apr 9 2026 1:40 PM

Trimurti Films Legally move On Dhurandhar 2 Songs

బాలీవుడ్‌ నటుడు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్‌-2 ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద అనేక రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇప్పటికే సుమారు రూ. 1700 కోట్ల కలెక్షన్స్‌ మార్క్‌ను అందుకుంది.  ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కాపీరైట్‌ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మూవీలో తమ అనుమతి లేకుండా సాంగ్‌ను రీమిక్స్‌ చేశారని ప్రముఖ నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

ధురంధర్‌-2 సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ (Hum Pyar Karne Wale) సాంగ్‌ బాగా వైరల్‌ అయింది. అయితే, ఈ సాంగ్‌ త్రిదేవ్‌(1989) చిత్రంలోని పాటనే రిమిక్స్‌ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్‌  ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్‌కు సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఇదే చిత్రం నుంచి ఐకానిక్ పాట 'ఓయ్ ఓయ్'ని కూడా ధురందర్ 2లో రీమిక్స్‌ చేయడం విశేషం.

దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్‌ దీనికి సమాధానమివ్వాలని కోరింది.  వెంటనే ఈ పాటను మూవీ నుంచి తొలగించాలని కోరింది. లేదంటే నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఇప్పటికే ధురంధర్‌-2 కథ కూడా తను రాసుకున్న స్టోరీనే అంటూ సంతోశ్‌ కుమార్ అనే దర్శకుడు ఆరోపించిన విషయం తెలిసింది. ముంబై హైకోర్టులో ఆయన పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే.. చోర్‌(దొంగతనం)లాంటి వ్యాఖ్యలు చేయడంపై కోర్టు సంతోశ్‌ను మందలించింది. బహిరంగంగా అలాంటి కామెంట్లు చేయొద్దని చెప్పడంతో..   ఆదిత్య ధర్‌కు తాత్కాలిక ఊరట లభించినట్లయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement