మెగాస్టార్ చెంతకు పర్సంటేజీ వివాదం.. అసలేం జరగనుంది? | tollywood percentage Issue reached to megastar chiranjeevi | Sakshi
Sakshi News home page

Chiranjeevi: చిరంజీవి చెంతకు పర్సంటేజీ వివాదం.. అసలేం జరగనుంది?

May 25 2026 6:30 PM | Updated on May 25 2026 6:42 PM

tollywood percentage Issue reached to megastar chiranjeevi

టాలీవుడ్ పర్సెంటేజ్ వివాదం మరింత రసవత్తరంగా మారింది. ఈ సమస్య చివరికీ మెగాస్టార్ వరకు చేసింది. ఈ వివాదం మరింత ముదరడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతస సంఘం చిరంజీవిని కలిశారు. దాదాపు గంటసేపు వీరితో చిరంజీవి సమావేశంలో కానున్నారు. ఎగ్జిబిటర్స్‌తో,  గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి భేటీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ రోజు తెలంగాణ ఎక్జిబిటర్స్, నిర్మాత కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల నియమించిన కమిటీ నుంచి అన్ని వివరాలు చిరంజీవి తెలుసుకున్నారని నిర్మాత దిల్ రాజు అన్నారు. రెండు మూడు రోజుల్లో అఫిషియల్‌గా చెబుతామని తెలిపారు. 

ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య..: ఎగ్జిబిటర్ శ్రీధర్..

ఇది ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య అని.. పెద్ది మూవీ గురించి కాదని ఎగ్జిబిటర్ శ్రీధర్ వెల్లడించారు.  చిరంజీవి రెస్పాన్స్ బాగుందని అన్నారు. అన్ని వివరాలు మెగాస్టార్ అడిగి తెలుసుకున్నారని వివరించారు. సింగిల్ స్రీన్ థియేటర్స్ పడుతున్న సమస్యలు ఇన్ని ఉన్నాయా అని చిరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని శ్రీధర్ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement