టాలీవుడ్ సూపర్ హిట్‌ డైరెక్టర్‌.. ఇలా సడన్ షాకిచ్చాడేంటి? | Tollywood Director Sandeep Reddy Vanga Visits Tirumala Today, Latest Look Goes Viral - Sakshi
Sakshi News home page

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌.. ఇలా సడన్ షాకిచ్చాడేంటి?

Published Wed, Mar 6 2024 6:32 PM

Tollywood Director Sandeep Reddy Vanga Visits Tirumala Today - Sakshi

గతేడాది యానిమల్‌తో సూపర్‌ హిట్‌ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. యానిమల్ సూపర్ హిట్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కాంబోలో రానున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. యానిమల్ సినిమా సమయంలో స్టైలిష్ హెయిర్‌ లుక్‌తో కనిపించిన సందీప్ రెడ్డి ఒక్కసారిగా గుండు కొట్టించుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సందీప్ రెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. యానిమల్ సూపర్ హిట్ కావడంతోనే మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement