పెళ్లి వార్తలపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్‌.. ఏకంగా ఐదుసార్లు! | Sakshi
Sakshi News home page

Anjali: 'పెళ్లి చేసుకుంటా.. కానీ ఇప్పుడిది నాకు ఐదో పెళ్లి'

Published Wed, Apr 3 2024 8:03 PM

Tollywood Actress Anjali open About Her Marriage Rumours Goes Viral - Sakshi

టాలీవుడ్  హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గీతాంజలి. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రీలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. 

పెళ్లి రూమర్స్‌పై అంజలి స్పందిస్తూ.. ' ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగుసార్లు పెళ్లి చేశారు. మళ్లీ ఐదోసారి కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేను కూడా చూశా. ఏకంగా పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని ఏంటంటే.. నేను అవుట్‌ డోర్‌ షూటింగ్స్‌లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్‌ న్యూస్‌. కానీ నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. అది ఇప్పుడైతే కాదు. దానికి ఇంకా టైముంది' అని చెప్పుకొచ్చింది. కాగా.. గీతాంజలి మళ్లీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. 

కాగా.. గీతాంజలి.. విశ్వన్‌ సేన్‌ మూవీ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరిలోనూ కనిపించనుంది. అంతే కాకుండా రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ తర్వాత నవీన్‌ పొలిశెట్టితో ఓ చిత్రం నటించనుంది. వీటితో పాటు మరో 6 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement