తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం | Tollywood Actor And Writer Tanikella Bharani Honoured With Doctorate, Deets Inside | Sakshi
Sakshi News home page

Tanikella Bharani Doctorate: తనికెళ్ల భరణికి డాక్టరేట్‌ ప్రకటించిన యూనివర్సిటీ

Jul 25 2024 5:31 PM | Updated on Jul 25 2024 5:39 PM

Tollywood Actor and Writer Tanikella Bharani Honoured with Doctorate

టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా ఆయన చేసిన సేవలకుగానూ డాక్టరేట్‌తో సత్కరించనుంది. ఈ అవార్డును ఆగస్ట్‌ 3వ తేదీన  వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారు.

కాగా.. తనికెళ్ల భరణి టాలీవుడ్‌లో దాదాపు 800కు పైగా చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా దాదాపు 50 సినిమాలకు పైగా రచయితగా అనేక విజయాలను అందుకున్నారు. సముద్రం సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ చిత్రంలో నటనకు ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, గ్రహణం మూవీకి ఉత్తమ నటుడిగా, మిథునం సినిమాకుగానూ ఉత్తమ రచయిత, దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారు. కాగా.. గతంలో ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement