రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి | Sakshi
Sakshi News home page

Apoorva Srinivasan: సీక్రెట్ గా నటి పెళ్లి.. ఫొటోలు వైరల్

Published Mon, Apr 15 2024 7:21 PM

Temper Movie Actress Apoorva Srinivasan Wedding - Sakshi

మరో నటి పెళ్లి చేసుకుంది. రహస్యంగా ప్రియుడితో ఏడడుగులు వేసింది. అయితే ఈ వేడుకకు ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ మాత్రమే హాజరైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: నా పెళ్లి వల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు: ప్రియమణి)

'టెంపర్' సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అపూర్వ శ్రీనివాసన్.. జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్ 2 తదితర చిత్రాల్లో పలు పాత్రలు చేసింది. ఈమె చివరగా 2022లో 'నీతో' మూవీ చేసింది. తర్వాత సైలెంట్ అయిపోయింది.

తాజాగా శ్రేయస్ శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి షాకిచ్చింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి కూడా ఈ పెళ్లికి వెళ్లింది.

(ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?)

Advertisement
 
Advertisement
 
Advertisement